Tamil Nadu: ప్రియురాలు కండక్టర్‌తో చనువుగా ఉంటుందని.. రాళ్లు రువ్వి బస్సు అద్దాలు ధ్వంసం..
Tamil Nadu: ప్రేమ పేరుతో జరుగుతున్న పైశాచికాలు పెరుగుతున్నాయి.
Tamil Nadu: ప్రియురాలు కండక్టర్‌తో చనువుగా ఉంటుందని.. రాళ్లు రువ్వి బస్సు అద్దాలు ధ్వంసం
Tamil Nadu: ప్రేమ పేరుతో జరుగుతున్న పైశాచికాలు పెరుగుతున్నాయి. తమిళనాడుళోని తిరుచ్చి జిల్లా సమయపురంలో తన ప్రియురాలు బస్సు కండక్టర్ తో చనువుగా మాట్లాడుతోందని బస్సు కండక్టర్ ను చితకబాది బస్సు అద్దాలు పగుల గొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుచ్చి జిల్లా తచ్చంకురిచ్చి ప్రాంతానికి చెందిన కార్తీ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన కాలేజీ విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. విద్యార్థిని రోజూ కాలేజీకి వెళ్తున్న క్రమంలో తను వెళ్లే ప్రైవేటు బస్సు కండక్టర్ తో చనువుగా మాట్లాడుతుండటాన్ని కార్తీ జీర్ణించుకోలేకపోయాడు.
కండక్టర్ నాగేశ్వరన్‌తో చనువుగా ఉండటం వల్ల తనను పట్టించుకోవడం లేదని భావించిన కార్తి తన స్నేహితులు గుణ, రాఖీలతో కలిసి మద్యం మత్తులో సమయపురం నల్ రోడ్డు సమీపంలో బస్సును ఆపి కండక్టర్ పై దాడికి దిగారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అడ్డొచ్చిన డ్రైవర్ పైనా దాడికి దిగారు. బస్సు అద్దాలపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. నాగేశ్వరన్ ఫిర్యాదు మేరకు సమయపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.