Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు.. లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా..
Yogi Adityanath: ఢిల్లీలో హనుమాన్ శోభాయాత్రలో చెలరేగిన హింస నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అలర్టయ్యారు.
Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు.. లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా..
Yogi Adityanath: ఢిల్లీలో హనుమాన్ శోభాయాత్రలో చెలరేగిన హింస నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అలర్టయ్యారు. నిర్ధేశిత ప్రాంతాల్లోనే మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలు జరుపుకోవాలని యోగి సూచించారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలిగించరాదనీ తెలిపారు. ప్రార్థనా స్థలాల్లో మైకులు వాడవచ్చని, అయితే వాటి శబ్ధం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండొద్దని యోగి పేర్కొన్నారు.
కొత్తగా మైక్ ల ఏర్పాటుకు పర్మిషన్లు ఇవ్వబోమన్నారు. త్వరలో రాబోయే హిందూ, ముస్లిం పండుగల్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా మతపరమైన నాయకులు, ప్రముఖులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనుమతుల్లేకుండా ఎటువంటి ఊరేగింపులు తీయరాదని యోగి హెచ్చరించారు.