Heavy Rains: దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు
Heavy Rains: ఢిల్లీ, హర్యానాలో భారీ వర్షాలు.. నోయిడా, గురుగ్రామ్‌కు ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rains: దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు
Heavy Rains: దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఢిల్లీలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఢిల్లీలోని రోడ్లపై భారీగా నీరు చేరడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వర్షాలకు నోయిడా, గురుగ్రామ్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హర్యానాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రహదారులపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో...గురుగ్రామ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఇవాళ అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురుగ్రామ్‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు హర్యానాలోని నర్సింగాపూర్ లో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మోకాలి లోతు నీటిలోనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. పార్క్ చేసిన వాహనాలన్నీ వరద దాటికి కొట్టుకుపోయాయి.