వైసీపీకి చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి పార్లమెంట్ కమిటీల్లో అత్యంత కీలకంగా భావించే పదవి దక్కింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లో మెంబర్ గా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఈయనకు అవకాశం దొరికింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఓ అనౌన్స్మెంట్ లో తెలిపింది. కాగా లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. ఆ కమిటీలో బాలశౌరి సభ్యుడిగా సేవలందించనున్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ రెవెన్యూ, ఖర్చులను ఆడిట్ చేస్తుంది. ఇందులో అధికార పక్ష సభ్యులతో పాటు విపక్షాలకూ అవకాశం ఇస్తారు. లోక్ సభలో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యా బలం ఆధారంగా ఈ నియామకాలు ఉంటాయి. కాంగ్రెస్, డీఎంకె తరువాత వైసీపీ కె ఎక్కువ మంది ఎంపీలు ప్రస్తుత లోక్ సభలో ఉన్నారు.