యానగొంది క్షేత్రం మాత మాణికేశ్వరి శివైక్యం...

కర్ణాటక - తెలంగాణ సరిహద్దుల్లోని యానాగొంది క్షేత్రంలో ఉన్న మాత మాణికేశ్వరి (86) శివైక్యం చెందారు. నిన్న రాత్రి 8 గంటల 50 నిమిషాలకు ఆరోగ్యం విషమించటంతో ఆమె ఆఖరి శ్వాస విడిచారు.

Update: 2020-03-08 05:38 GMT

కర్ణాటక - తెలంగాణ సరిహద్దుల్లోని యానాగొంది క్షేత్రంలో ఉన్న మాత మాణికేశ్వరి (86) శివైక్యం చెందారు. నిన్న రాత్రి 8 గంటల 50 నిమిషాలకు ఆరోగ్యం విషమించటంతో ఆమె ఆఖరి శ్వాస విడిచారు. దీంతో కర్ణాటక - తెలంగాణ సరిహద్దుల్లోని యానాగొంది క్షేత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెళ్లి, సంసారం, కుటుంబ జీవితాన్నిత్యజించి చిన్ననాటి నుంచే దైవచింతనలో గడిపారు మాతా మణికేశ్వరి. అహింస పరమో ధర్మమే లక్ష్యంగా బోధనలు గావిస్తూ ప్రజలకు చేరువైన మాతామాణికేశ్వరి కర్ణాటకలోని సేడం తాలూకా మల్హాబాద్‌లో 1934 జూలై 26 వ తేదిన ఆశమ్మ, బుగ్గప్పల కుమార్తెగా మాత జన్మించారు.

బాల్యంలో పశువుల కాపరిగా కొంతకాలం జీవితాన్ని కొనసాగించారు. ఆ సమయంలోనే ఆమె ఎక్కువగా ధ్యానంలోనే గడిపేవారు. మాత దైవిక శరీరమని తెలియక తాకినవారికి శరీరమంతా మంటలు రేగడంతో ఆమెలో ఏదో శక్తి ఉందని ప్రజల విస్వసించారు. యానగుందిలో ఆమె నీటితో దీపాలు వెలిగించేవారని, 75ఏండ్లుగా ఆహారం తీసుకోకుండా ఉంటున్నారని భక్తులు చెబుతుంటారు. ఏటా శివరాత్రికి, గురుపూజోత్సవం రోజు భక్తులకు దర్శనం ఇచ్చేవారు.ఆమె చివరి సారిగా గత నెల 21న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చారు.

Tags:    

Similar News