Anurag Thakur: నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్ల భేటీ
Anurag Thakur: రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించిన క్రీడా శాఖ మంత్రి
Anurag Thakur: నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్ల భేటీ
Anurag Thakur: ఇవాళ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు భేటీకానున్నారు. క్రీడా శాఖ మంత్రి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించారు. టాప్ రెజ్లర్లయిన బజరంగ్ పునియా, సాక్షిమాలిక్, వినేష్ ఫొగాట్ నేతృత్వంలో రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తమతో ఆయన దారుణంగా ప్రవర్తించేవారని, అసభ్య కార్యకలాపాలకు పాల్పడేవారని మహిళా రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్, మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్ ఏప్రిల్ 28న దాఖలైంది.