ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం.. గిన్నిస్ రికార్డ్..

Hubballi: ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం కలిగిన స్టేషన్‌గా హుబ్లీలోని శ్రీ సిద్ధారూఢ స్వామిజీ రైల్వేస్టేషన్‌ రికార్డు సృష్టించింది.

Update: 2023-03-13 06:14 GMT

ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం.. గిన్నిస్ రికార్డ్..

Hubballi: ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం కలిగిన స్టేషన్‌గా హుబ్లీలోని శ్రీ సిద్ధారూఢ స్వామిజీ రైల్వేస్టేషన్‌ రికార్డు సృష్టించింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకుందని నైరుతి రైల్వే సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే జోన్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హుబ్లీ రైల్వే ప్లాట్ ఫామ్‌లను ఆదివారం జాతికి అంకితం చేశారు. ఈ రైల్వే స్టేషన్‌లో ఇప్పటి వరకు ఐదు ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. తాజాగా మరో మూడు కొత్త ఫ్లాట్‌ఫామ్‌లను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఎనిమిదో ఫ్లాట్‌ఫామ్‌ 15వందల7 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఫ్లాట్‌ఫామ్‌గా రికార్డుకెక్కింది. దీని నిర్మాణంతో హుబ్లీ- ధార్వాడ ప్రాంతంలో రవాణా అవసరాలు తీరనున్నాయి.

Tags:    

Similar News