Women: ఈ కారణంగా మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

Women: ఈ కారణంగా మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

Update: 2022-04-14 06:30 GMT

Women: ఈ కారణంగా మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

Women: మహిళా ఉద్యోగులకు సంబంధించిన లింక్డ్‌ఇన్ నివేదికలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీతాలలో కోత, పక్షపాతం, వెసులుబాటు లేకపోవడం వంటి కారణాలతో దేశంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉద్యోగాలను వదిలేస్తున్నారని నివేదికలో వెల్లడైంది. 2,266 మంది మహిళలతో జరిపిన సంభాషణల ఆధారంగా లింక్డ్‌ఇన్ ఈ నివేదిక విడుదల చేసింది. పని ప్రదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై నివేదిక దృష్టి సారించింది. కొవిడ్‌ తర్వాత 10 మందిలో 8 మంది శ్రామిక మహిళలు తాము మరింత సరళమైన రీతిలో పని చేయాలని భావిస్తున్నట్లు లింక్డ్‌ఇన్ పరిశోధనలో తేలింది.

పనిచేసే స్థలంలో వాతావరణం, ఫ్లెక్సిబిలిటీ లేనందు వల్ల 72 శాతం మంది మహిళలు పెద్ద పెద్ద ఆఫర్‌లని తిరస్కరిస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు ఫ్లెక్సిబిలిటీ అనేది పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సహాయపడుతుందని చెప్పారు. ఇది కెరీర్‌లో పురోగతికి కూడా సహాయపడుతుందన్నారు.

అయితే ముగ్గురిలో ఒకరు మాత్రం ఫ్లెక్సిబిలిటీ అనేది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. లింక్డ్‌ఇన్‌లోని ఇండియా టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ సీనియర్ డైరెక్టర్ రుచి ఆనంద్ మాట్లాడుతూ "కంపెనీలు, యజమానులు తమ అత్యుత్తమ ప్రతిభను కోల్పోకూడదనుకుంటే సమర్థవంతమైన అనువైన విధానాలను రూపొందించడానికి ఈ సర్వే సహకరిస్తుందన్నారు" 

Tags:    

Similar News