Bengaluru: ర్యాపిడో డ్రైవర్ వికృత చేష్టలు.. భయపడి బైక్‌పై నుంచి దూకిన మహిళ!

Bengaluru: గాయాలు అవ్వడంతో ఆస్పత్రికి తరలింపు

Update: 2023-04-26 07:49 GMT

Bengaluru: ర్యాపిడో డ్రైవర్ వికృత చేష్టలు.. భయపడి బైక్‌పై నుంచి దూకిన మహిళ!

Bengaluru: కర్ణాటకలో షాకింగ్ సంఘటన జరిగింది. బెంగుళూర్‌లో రాపిడో బైక్‌ రైడర్ వేధింపుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి 30 ఏళ్ల మహిళ.. కదులుతున్న రాపిడో బైక్‌పై నుండి దూకి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 21న రాత్రి 11.30 గంటల సమయంలో ఇందిరానగర్‌కు వెళ్లడానికి ర్యాపిడో బైక్‌ను యాప్‌లో బుక్‌ చేసింది. ఈ క్రమంలో మహిళను పికప్‌ చేసుకున్న బైకర్‌ ఆమె మొబైల్‌ను లాక్కుని, కౌగిలించుకుని వెకిలిచేష్టలు చేశాడు. వెళ్లాల్సిన చోటుకు కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్తుండగా ఆమె అతడిని ప్రశ్నించింది. సమాధానం ఇవ్వకుండా మరింత వేగంగా బైక్‌ను పోనిచ్చాడు.

దీంతో భయాందోళనకు గురైన మహిళ... బైకు నుంచి దూకడంతో గాయపడింది. తన స్నేహితురాలికి, పోలీసులకు కాల్‌ చేసి సాయం అడిగింది. పోలీసులు ఇది ప్రేమికుల గొడవ అనుకుని స్పందించలేదని బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ర్యాపిడో బైకర్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై కిడ్నాప్, వేధింపులు, లైంగికదాడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News