Viral: వీడు డాక్టరా? ఛీ... రీల్స్ చూస్తూ పేషెంట్‌ను వదిలేశాడు.. చివరకు గుండెపోటుతో
Viral: ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వాడకంతోపాటు ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ హంగామా బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ వీటికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా యూత్ రీల్స్ చూస్తూ సమయం వృధా చేసుకుంటున్నారు. అంతేకాదు రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతుంది. ఇప్పటి చాలా మంది వీటితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
కానీ ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే పేషంట్లను పట్టించుకోకుండా రీల్స్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో తాజాగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందర్నీ షాక్ గురి చేస్తోంది. గుండె పోటుతో ఆసుపత్రికి వచ్చిన మహిళను పట్టించుకోకుండా డ్యూటీ డాక్టర్ రీల్స్ చూస్తూ టైంపాస్ చేశాడు. చివరికి ఆ మహిళ ప్రాణం పోయింది.
పూర్తి వివరాలు చూస్తే ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లాకు చెందని 60 ఏళ్ల వృద్ధురాలు ఆస్వస్థతకు గురవ్వడంతో ఆమె కుమారులు మెయిన్ పురి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి స్ట్రెక్చర్ మీద తన తల్లి పడుకోపెట్టి డాక్టర్ వద్దకు పరిగెత్తారు. తమ తల్లి అస్వస్థతకు గురయ్యిందని వచ్చి చూడాలని డాక్టర్ ను కోరారు. సదరు డాక్టర్ నర్సులను చూడమని సూచించారు. మహిళలను పరీక్షించిన నర్సు జలుబు, జ్వరం ఉందని ఏం కాదని చెప్పింది. కొద్ది సేపటికే ఆ మహిళ ముక్కులో నుంచి రక్తస్రావం కావడంతో కంగారు పడిన మహిళ కుమారుడు మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డ్యూటీ డాక్టర్ ఫోన్లో రీల్స్ చూస్తూ కనిపించడంతో కోపంతో రగిలిపోయిన ఆ యువకుడు డాక్టర్ పై చేయి చేసుకున్నాడు. దీంతో ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేశారు.
సదరు మహిళ కుమారుడు గురు శరణ్ సింగ్ మాట్లాడుతూ నా సోదరులతో కలిసి మా అమ్మను మెయిన్ పురి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాము. వెంటనే అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లి మా అమ్మ పరిస్థితి గురించి వివరించాము. జలుబు చేసినట్లుంది నర్సులు వస్తారని చెప్పి ఫోన్ చూస్తున్నాడు. నర్సు చూసి మీ తల్లి బాగానే ఉందని చెప్పారు. కొద్ది సేపటికే ముక్కులో నుంచి రక్తం వచ్చింది.. మేము భయపడి డాక్టర్ దగ్గరకు వెళ్లి చెబితే అప్పుడు వచ్చి చూసాడని..అప్పటికే తన తల్లి ప్రాణం పోయిందని వాపోయాడు.
ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. సీసీటీవీ ఫుటేజీ చూసిన చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణం పోయిందని ధ్రువీకరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.