తల్లీకూతురిని ఢీకొట్టిన అంబులెన్స్‌.. ఆగ్రహంతో అంబులెన్స్‌కు నిప్పు..

Uluberia Road Accident: బస్సు కోసం రోడ్డు పక్కన ఎదురు చూస్తున్న తల్లి, కూతురును అంబులెన్స్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2022-10-15 14:58 GMT

తల్లీకూతురిని ఢీకొట్టిన అంబులెన్స్‌.. ఆగ్రహంతో అంబులెన్స్‌కు నిప్పు..

Uluberia Road Accident: బస్సు కోసం రోడ్డు పక్కన ఎదురు చూస్తున్న తల్లి, కూతురును అంబులెన్స్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అన్యాయంగా తల్లీకూతురును అంబులెన్స్‌ ఢీకొట్టిందంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు. అంబులెన్స్‌కు నిప్పంటించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో జరిగింది. మృతులిద్దరూ హౌరా జిల్లాలోని ఉలుబేరియాలోని జోర్డ్‌కలాకు చెందిన 40 ఏళ్ల అపర్ణ పరాల్‌, ఆమె కూతురు పదేళ్ల తులసీ పరాల్‌గా గుర్తించారు.

సమీపంలోని బాగ్నాన్‌లో నిర్వహించే స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌కోసం తులసీని తీసుకెళ్లేందుకు తల్లి అపర్ణ పరాల్‌ ముంబై జాతీయ రహదారిపై బస్సుకోసం వేచి ఉన్నారు. అదే సమయంలో అటువైపు వేగంగా దూసుకొస్తున్న అంబులెన్స్‌ అదుపుతప్పి వారిద్దరినీ ఢీకొట్టింది. దీంతో అపర్ణ, తులసీ అక్కడికక్కడే మరణించారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అంబులెన్స్‌ వద్దకు పరుగులు తీశారు. అదే సమయంలో అక్కడి నుంచి డ్రైవర్‌ పారిపోయాడు. దీంతో కొందరు గ్రామస్థులు ఆగ్రహంతో అంబులెన్స్‌కు నిప్పంటించారు. రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. చివరికి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. 

Tags:    

Similar News