పెళ్లయిన విషయం దాచి ప్రేమాయణం.. ప్రియుడికి ఊహించని శిక్ష వేసిన యువతి!
Woman Attacks Lover: దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడన్న కోపంతో ఒక యువతి, తన ప్రియుడికి మత్తుమందు ఇచ్చి అత్యంత కిరాతకంగా మర్మావయవాలను కోసేసింది.
పెళ్లయిన విషయం దాచి ప్రేమాయణం.. ప్రియుడికి ఊహించని శిక్ష వేసిన యువతి!
Woman Attacks Lover: దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడన్న కోపంతో ఒక యువతి, తన ప్రియుడికి మత్తుమందు ఇచ్చి అత్యంత కిరాతకంగా మర్మావయవాలను కోసేసింది. ఫిబ్రవరి 25న ఢిల్లీలోని వజీరాబాద్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన విసర్జీత్ (22) అనే యువకుడు ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం బీహార్‌కు చెందిన అమీనా ఖాతూన్‌తో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే, విసర్జీత్‌కు అప్పటికే పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టి అమీనాతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అమీనా, అతడిపై పగ పెంచుకుంది.
పథకం ప్రకారం దాడి:
ఫిబ్రవరి 24న విసర్జీత్‌ను వజీరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించుకున్న అమీనా, రాత్రి సమయంలో అతడికి మత్తుమందు కలిపిన పాలను తాగించింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత, పదునైన ఆయుధంతో అతడి మర్మావయవాలను కోసేసింది. తెల్లవారుజామున తీవ్ర రక్తస్రావంతో స్పృహలోకి వచ్చిన బాధితుడు, సమీపంలోని హిందూరావ్ ఆస్పత్రిలో చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు:
ఆస్పత్రి వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అమీనా ఖాతూన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. నిందితురాలు బీహార్‌లోని కటిహార్‌కు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.