LIC Bima Kavach: వృద్ధాప్యంలోనూ కొండంత అండ.. 100 ఏళ్ల వరకు రిస్క్ కవర్ ఇచ్చే 'LIC Bima Kavach' పూర్తి వివరాలివే!

LIC Bima Kavach: దీర్ఘకాల భద్రతకు ఎల్ఐసీ కొత్త ప్లాన్.. 100 ఏళ్ల వయస్సు వరకు రక్షణ, కుటుంబానికి ఆర్థిక భరోసా!

Update: 2026-02-27 11:44 GMT

LIC Bima Kavach: వృద్ధాప్యంలోనూ కొండంత అండ.. 100 ఏళ్ల వరకు రిస్క్ కవర్ ఇచ్చే 'LIC Bima Kavach' పూర్తి వివరాలివే!

భారతీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (LIC) సామాన్యుల ఆర్థిక భద్రత కోసం "బీమా కవచ్" పేరుతో ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఇది స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేని ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటూ, 100 ఏళ్ల వయస్సు వరకు కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా దీనిని రూపొందించారు. ఈ ప్లాన్ ప్రత్యేకతలు ఏంటి, దీని పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ ప్లాన్ లోని అద్భుతమైన ఫీచర్లు ఇవే..

సాధారణంగా పాత పాలసీల్లో ఇన్సూరెన్స్ విలువ మారదు. కానీ, ఈ ప్లాన్‌లో మీ వయస్సు, బాధ్యతలు పెరిగేకొద్దీ, బీమా కవరేజీ కూడా దామాషా ప్రకారం పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో పెరిగే ద్రవ్యోల్బణం దృష్ట్యా మీ కుటుంబానికి తగినంత ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. చాలా టర్మ్ ప్లాన్లు 60 లేదా 70 ఏళ్లకే ముగుస్తాయి. కానీ "బీమా కవచ్" పాలసీదారునికి 100 ఏళ్ల వయస్సు వచ్చే వరకు జీవితకాల రక్షణను హామీ ఇస్తుంది. అంటే మీ తదనంతరం కూడా మీ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఇది భరోసా ఇస్తుంది.

జీవితంలో పెళ్లి, పిల్లల జననం వంటి ముఖ్యమైన ఘట్టాలు ఎదురైనప్పుడు బాధ్యతలు పెరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఆయా సమయాల్లో మీ బీమా కవరేజీని పెంచుకునే వెసులుబాటును LIC కల్పించింది. ఈ సౌకర్యం 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉండి, సాధారణ ప్రీమియంలు చెల్లించే వారికి మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. పాలసీదారులు తమ ఆదాయ వనరులను బట్టి ప్రీమియంను వివిధ రకాలుగా చెల్లించవచ్చు.

సింగిల్ ప్రీమియం అంటే.. ఒకేసారి చెల్లించడం, రెగ్యులర్ వాయిదాల పద్ధతిలో కూడా ఈ ప్రీమియంను చెల్లించవచ్చు. అంటే పాలసీ కాలమంతా చెల్లించడం అని అర్థం. దీంతో పాటు 5, 10 లేదా 15 ఏళ్ల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

అర్హతలు, ఇతర ప్రయోజనాలు:

18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. స్మోకింగ్ చేయని వారికి ప్రత్యేకంగా ప్రీమియంలో డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ పాలసీని నేరుగా LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొనుగోలు చేయవచ్చు. పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న జీవనశైలికి అనుగుణంగా తమ కుటుంబానికి పూర్తి స్థాయి రక్షణ కవచం కావాలనుకునే వారికి LIC బీమా కవచ్ ఒక సరైన ఎంపిక అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News