Rahul Gandhi: జీవితంలో గెలుపు, ఓటములు సహజం
Rahul Gandhi: స్మృతి ఇరానీపై కామెంట్ల విషయంలో రాహుల్ గాంధీ ట్వీట్
Rahul Gandhi
Rahul Gandhi: కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీపై అసభ్య పదజాలం వినియోగించకూడదని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. అవమానించడం బలహీనతకు సంకేతమని.... బలానికి కాదన్నారు రాహుల్ గాంధీ. 2019 ఎన్నికల్లో అమేథిలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ 55 వేల ఓట్లతో ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి విధేయుడు అయిన కిషోర్ లాల్ చేతిలో స్మృతి ఇరానీ లక్షన్నరకు పైగా ఓట్లతో పరాజయం పాలయ్యారు. నాటి నుంచి స్మృతి ఇరానీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.