ఇలా తయ్యారయ్యారేంట్రా బాబూ.. సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..

తమిళనాడు ధర్మపురి జిల్లా అరూర్‌ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో దారుణం వెలుగు చూసింది.

Update: 2025-07-21 06:33 GMT

ఇలా తయ్యారయ్యారేంట్రా బాబూ.. సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..

తమిళనాడు ధర్మపురి జిల్లా అరూర్‌ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో ఓ మహిళ భర్తను విషం ఇచ్చి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

స్థానికంగా డ్రైవర్‌గా పని చేస్తున్న రసూల్‌ (35)కి భార్య అమ్ముబీ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రసూల్‌కు ఆకస్మికంగా వాంతులు అయ్యాయి. అనంతరం స్పృహ కోల్పోయడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను సేలంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రసూల్‌ రక్తంలో పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ విషయంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల్లో అనుమానాలు మేల్కొన్నాయి. అమ్ముబీ మొబైల్‌ను పరిశీలించగా, ఆమె స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌ అనే వ్యక్తితో ఉన్న వాట్సప్‌ చాటింగ్‌ బయటపడింది. అందులో అమ్ముబీ.. ‘‘నువ్విచ్చిన విషం మొదట దానిమ్మ రసంలో కలిపాను. కానీ రసూల్‌ తాగలేదు. అందుకే ఆహారంలో కలిపాను’’ అని పేర్కొనడంతో నిజం బయటపడింది.

చికిత్స పొందుతూ రసూల్‌ మరణించగా, బాధితుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి నిందితులు అమ్ముబీ, లోకేశ్వరన్‌లను శనివారం అరెస్ట్ చేశారు. ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

Tags:    

Similar News