GST: పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావు.. కారణమేంటో తెలుసా..?

GST: పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సామాన్యుడి కల.

Update: 2021-12-26 14:30 GMT

పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావు.. కారణమేంటో తెలుసా..?

GST: పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సామాన్యుడి కల. కానీ ఇది జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం 1300 వస్తువులు, 500 సేవలపై జీఎస్టీ విధిస్తుంది. కానీ ఇంధన వనరులపై మాత్రం జీఎస్టీ ఉండదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. రీసెంట్ గా పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టినప్పుడు డిబేట్లు పెట్టినా ప్రభుత్వాలు నెమ్మదిగా ఈ అంశాన్ని కూల్‌ చేసాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే పెట్రోల్, డీజిల్ ఎందుకు జీఎస్టీ పరిధిలోకి రాకూడదు? దీనికి మూడు పెద్ద కారణాలున్నాయి.

మొదటిది కేంద్ర ప్రభుత్వం భారీ ఆదాయ వనరు ఇంధన వనరులు, రెండోది రాష్ట్రాలు కూడా వీటిపైనే ఆధారపడటం, మూడవ అంశం ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్. ఈ కారణాల వల్ల పెట్రోల్‌, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావడం లేదు.1300 వస్తువులు, 500 సేవలపై జీఎస్టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 11.41 లక్షల కోట్లు ఆర్జిస్తోంది. ఈ లెక్కలు 2020-21 సంవత్సరానికి సంబంధించినవి. అయితే ఇందులో పెట్రోల్, డీజిల్ ద్వారా మాత్రమే రూ. 4.5 లక్షల కోట్లను ఆర్జించింది. అంటే ప్రభుత్వం మొత్తం జీఎస్టీ వసూళ్లలో 40 శాతం పెట్రోల్, డీజిల్ ద్వారానే వస్తుంది.

జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత పన్ను వసూలు చేయడానికి రాష్ట్రాలకు వనరులు పరిమితం. ఇప్పుడు రాష్ట్రాలకు మద్యం, పెట్రోల్, డీజిల్ ప్రధాన ఆదాయ వనరులు. 2020-21 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ద్వారా రాష్ట్రాలు మొత్తం 2 లక్షల కోట్లకు పైగా ఆర్జించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఇష్టానుసారం పన్నును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. వివిధ రాష్ట్రాల్లో వ్యాట్ రేటు భిన్నంగా ఉండడానికి ఇదే కారణం.మూడో సమస్య ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కి సంబంధించినది. కాబట్టి మొత్తం విషయం ఏమిటంటే, పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధారపడటం ఎక్కువగా ఉన్నంత కాలం అవి GST పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. 

Tags:    

Similar News