Delta Variant: డెల్టా వేరియంట్ ఒక్కటే ఆందోళనకరం..డబ్ల్యూహెచ్ఓ

Delta Variant:భారత్ లో వెలుగు చూసిన మూడు వేరియంట్లలో బి.1.617.2 రకం మాత్రమే ఆందోళనకరంగా ఉందని డబ్ల్యూహెచ్ తెలిపింది.

Update: 2021-06-03 05:07 GMT

Representational Image

Delta Variant: ప్రపంచాన్నే వణికించిన కరోనా మహమ్మారి ఎంతో మందిదాని బారిన పడగా,...అనేక మందిని పొట్టన పెట్టుకుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ అన్ని రకాల వయసుల వారికీ నరకం చూపిస్తోంది. అయితే భారత్ లో మొదటిసారి వెలుగు చూసిన బి.1.617 బిభాగంలో మూడు వేరియంట్లలో ప్రస్తుతం బి.1.617.2 రకం మాత్రమే ఆందోళన కరంగా వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇదే విభాగానికి చెందిన మిగతా రెండు వేరియంట్ల వ్యాప్తి మితంగానే ఉన్నట్లు తెలిపింది.

ఈ మేరకు ఆ సంస్థ కోవిడ్-19 వారాంత నివేదికను మంగళవారం విడుదల చేసింది. ''బి.1.617.2(డెల్టా) రకం వైరస్ వివిధ దేశాల్లో ఎలా సంక్రమిస్తోంది? మరి దేశాలకు ఎలా వ్యాపిస్తోంది? అన్నది పరిశీలిస్తున్నాం . జూన్ 1 నాటికి ఈ వైరస్ ఉనికి మొత్తం 62 దేశాల్లో ఉంది. బి.1.617.1 స్ట్రైయిన్ ను వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్ (వీవోఐ)గా వర్గీకరించాం. కొన్ని ప్రాంతాల్లో ఈ 'కప్పా' రకం వ్యాప్తి వేగంగానే ఉంది. ఒక బి.1.617.3 రకం వ్యాప్తి మాత్రం చాలా తక్కవు. అందుకే దీన్ని వీవోసి లేదా వీవోఐగా వర్గీకరించలేదు. అయితే దీనిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్లను అందరికీ అందించాలని కూడా సూచించింది.

Tags:    

Similar News