జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ..
Mamata Banerjee: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ..
Mamata Banerjee: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు యూపీఏ, ఇటు ఎన్డీఏకు దీటుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు బెంగాల్ బెబ్బులి దీదీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. యూపీఏ కూటమి ఇక గడచిన చరిత్ర అంటున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీదీ. 2024లో బీజేపీ ఓటమి ధ్యేయంగా ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ తో ఆమె భేటీ అయ్యారు.
దాదాపు రెండు గంటల పాటూ జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు. దేశప్రజల సంక్షేమం కోసం, ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణకు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించామని శరద్ పవార్ ప్రకటించారు. యూపీఏ కూటమి ఎప్పుడో అంతరించిపోయిందని ఇకపై కొత్త కూటమి ప్రయత్నాలు జరుగుతాయనీ హింట్ ఇచ్చారు దీదీ. నిన్న శివసేన నేత ఆదిత్య థాకరేను, సంజయ్ రౌత్ ను కూడా మమతా బెనర్జీ కలుసుకున్నారు. సీఎం ఉద్ధవ్ థాకరేకు అనారోగ్యం కారణంగా ఆయనతో దీదీ భేటీ కుదరలేదు.