ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం వినూత్న నిరసన

Update: 2021-02-25 14:10 GMT

ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం వినూత్న నిరసన

ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర సచివాలయానికి ఎలక్ట్రిక్ స్కూటీలో చేరుకున్నారు. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ స్కూటర్‌ను నడుపగా, మమతా హెల్మెట్‌ ధరించి వెనక సీట్లో కూర్చున్నారు. ఇద్దరు కలిసి కోల్‌కతా వీధుల్లో చక్కర్లు కొట్టారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ ఫ్లకార్డును మెడలో ధరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసే బ్యానర్ ప్రదర్శించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌ ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని గమనించివచ్చని మమతా బెనర్జీ తెలిపారు. మోడీ, అమిత్‌ షా దేశాన్ని అమ్మేస్తున్నారని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు.

Tags:    

Similar News