Kerala: కేరళలో తగ్గుతున్న కరోనా కేసులు..లాక్‌డౌన్ అస్త్రం పనిచేసిందన్న..

Kerala: కరోనా కేసుల కట్టడికి విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు.

Update: 2021-06-12 05:02 GMT

పినరయి విజయన్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Kerala: కరోనా కేసుల కట్టడికి విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. నియంత్రణలతో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు వైరస్ వ్యాప్తి రేటు కూడి దిగివస్తోందని చెప్పారు. ఇవాళ, రేపు ఆదివారాల్లో విధించే వీకెండ్ లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. వీకెండ్ లాక్‌డౌన్‌లో కేవలం నిత్యావసరాల దుకాణాలు, ఎమర్జెన్సీ సేవాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పారు. నిన్న కేరళలో 14 వేల 233 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 173 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 వేల 355 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కేరళలో కరోనా లాక్‌డౌన్‌ను ఈనెల 16వరకూ పొడిగించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News