Narendra Modi: ప్రపంచ క్షేమం కోసం భారత్ కీలక నిర్ణయం!

Update: 2020-04-07 08:53 GMT

హైడ్రాక్సీ క్లోరోక్వీన్ కరోనాపై పోరాటంలో భారత్ దగ్గరున్న ఆయుధం. ప్రస్తుతం దీనికోసం అమెరికా సహా దాదాపు 30 దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. దీంతో ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని సడలించేందుకు భారత్ సుముఖం వ్యక్తం చేసింది. మానవతా దృక్పతంతో ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని సడలించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను సరఫరా చేసేందుకు మార్గం సుగమమైంది.

నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ను పంపించాలంటూ అభ్యర్థించారు. అయితే దీనిపై మోడీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ భారత్‌పై ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేశారు. తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంపై విమర్శలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన భారత్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించాలని నిర్ణయం తీసుకుంది.

ఇటీవలే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ సహా కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇతర మందుల ఎగుమతిపై భారత్‌ నిషేధం విధించింది. అయితే ఈ ఔషధం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అమెరికా సహా 30 దేశాలు కోరుతున్నాయి. దీంతో మానవతా దృక్పథంతో మోడీ సర్కార్ నిషేధాన్ని సడలించింది.

Full View


Tags:    

Similar News