Fire Accident: బీహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి
Fire Accident: ముగ్గురు మహిళలు సహా ఆరుగురు మృతి
Fire Accident: బీహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి
Fire Accident: బిహార్ రాజధాని పాట్నాలో అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్వే జంక్షన్ సమీపంలోని ఓ హోటల్‌లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు మృతి చెందగా..20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భారీ క్రేన్ల ద్వారా కిందకు దించి..హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫైర్ సేప్టీ లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు అనుమానిస్తున్నారు.