దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉంది : అమిత్ షా

Update: 2019-09-14 11:06 GMT

హిందీ దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ భారతావనిని ఒక్క తాటి పైకి తీసుకురాగల సామర్థ్యం హిందీకి ఉందని నొక్కి చెప్పారు. దేశ ప్రజలకు హిందీ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశంలో అనేక భాషలు ఉన్నా.. దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో దోహదపడుతుందన్నారు. దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని.. యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చారు. భారతీయులంతా ఇప్పటినుంచి హిందీ మాట్లాడటంపై ఎక్కువ దృష్టి పెట్టాలని.. తద్వారా మహాత్మాగాంధీ,సర్దార్ పటేల్ కలలను నిజం చేయాలని మరో ట్వీట్‌లో అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News