Maharashtra: దాహం తీర్చుకునేందుకు చెమటోడుస్తున్న మహిళలు

Maharashtra: మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని మేల్‌ఘాట్‌లో దారుణ పరిస్థితి

Update: 2022-06-10 07:03 GMT

Maharashtra: దాహం తీర్చుకునేందుకు చెమటోడుస్తున్న మహిళలు

Maharashtra: నీటి కష్టాలతో మహారాష్ట్ర ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. బకెట్ నీటి కోసం మైళ్లదూరం ప్రయాణిస్తున్నారు. మండు టెండలో దాహం తీర్చుకునేందుకు మహిళలు చెమటోడుస్తున్నారు. అమరావతి జిల్లాలోని మేల్‌ఘాట్ పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అక్కడ ఉన్న గిరిజన ప్రజలు నీళ్ల కోసం ప్రాణాలకు తెగిస్తు్న్నారు. ఖాదియాల్ గ్రామంలో ఉన్న రెండు బావుల దగ్గర మాత్రమే నీరు దొరుకుతుంది. దీంతో స్థానికులు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారు.

గ్రామంలో ఉన్న బావుల్లో నీటి తోడేందుకు జనం ఎగబడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వచ్చిన నీటిని ముందుగా బావిలోకి వదులుతున్నారు. ఆ తర్వాత ఆ నీటిని అక్కడి జనం బకెట్లు, బిందెలతో తోడుకుంటున్నారు. హృదయవిదారక రీతిలో మేల్‌ఘాట్‌లో ప్రజలు జీవిస్తున్నారు. బావి నుంచి తోడిన నీళ్లు మురికిగా ఉంటున్నాయని ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News