Saalumarada Thimmakka: వృక్షమాత సాలుమరద తిమ్మక్క కన్నుమూత

Update: 2025-11-14 08:49 GMT

Saalumarada Thimmakka: వృక్ష సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసి, పద్మశ్రీ పురస్కారం అందుకున్న కర్ణాటకకు చెందిన 'వృక్షమాత' సాలుమరద తిమ్మక్క (Salumarada Thimmakka) (114) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తిమ్మక్క మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 1911 జూన్ 30న జన్మించిన సాలుమరద తిమ్మక్క, పర్యావరణ పరిరక్షణకు చేసిన నిస్వార్థ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

ఆమె చేసిన విశిష్ట సేవలకుగాను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈమె ఇందిరా ప్రియదర్శిని, నాడోజా వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను, గౌరవ డాక్టరేట్‌ను కూడా అందుకున్నారు. బెంగళూరు-హుళికల్ మధ్య దాదాపు 400లకు పైగా మర్రి మొక్కలను నాటి, వాటిని సంరక్షించిన ఆమె సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

Tags:    

Similar News