Assembly Elections 2022: పంజాబ్, యూపీలో కొనసాగుతున్న పోలింగ్

Assembly Elections 2022: ఐదు రాష్ట్రాలకు వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2022-02-20 05:23 GMT

Assembly Elections 2022: పంజాబ్, యూపీలో కొనసాగుతున్న పోలింగ్

Assembly Elections 2022: ఐదు రాష్ట్రాలకు వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాల్లో 59 స్థానాలకు, పంజాబ్‌లోని 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉదయం 9గంటల వరకు 8.15 శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్‌లో మాత్రం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అక్కడ ఉదయం 9గంటల వరకు 4.80 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తొలిసారి ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆయన పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలోనూ పోలింగ్ జరుగుతోంది. యూపీలో ఈ విడతలో బరిలో ఉన్న ప్రముఖుల్లో అఖిలేశ్ చిన్నాన్న శివ్‌పాల్ యాదవ్, బీజేపీ నేత సతీశ్ మహానా, రామ్‌వీర్ ఉపాధ్యాయ్, అసీం అరుణ్, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మత్రి సల్మాన్ కుర్షీద్ భార్య లూయిస్ కుర్షీద్ తదితరులు ఉన్నారు. ఈ విడతతో యూపీలో దాదాపు సగం సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది.

పంజాబ్ విషయానికి వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, అకాలీదళ్‌కు చెందిన విక్రమ్ సింగ్, అమరీందర్ సింగ్, అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. ఇక మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Full View


Tags:    

Similar News