Voter id Aadhaar: ఓటర్‌ ఐడీ, ఆధార్‌తో లింక్‌.. పూర్తి ప్రాసెస్ తెలుసుకోండి..!

Voter id Aadhaar: దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రచారాన్ని ప్రారంభించింది.

Update: 2022-08-04 07:31 GMT

Voter id Aadhaar: ఓటర్‌ ఐడీ, ఆధార్‌తో లింక్‌.. పూర్తి ప్రాసెస్ తెలుసుకోండి..!

Voter id Aadhaar: దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రచారం మొదలెట్టింది. అయితే ఈ లింకింగ్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందం అంతేకాదు ఉచితంగా చేస్తారు. ఎవ్వరు ఓటర్‌ ఐడీని ఆధార్‌తో లింక్‌ చేసుకోమని బలవంత పెట్టకూడదు. ఎన్నికల సంఘం ఈ పనిని 31 మార్చి 2023 నాటికి పూర్తి చేయనుంది.

ఎన్నికల సంఘం ఈ ప్రచారంలో ఓటర్ల నమోదు, ధృవీకరణ, ఓటర్ ఐడిని ఆధార్‌తో అనుసంధానించే పని చేస్తుంది. ఎన్నికల చట్టం బిల్లు ఓటర్ ID కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి అధికారం ఇస్తుంది. ఈ బిల్లు డిసెంబర్ 2021లో వాయిస్ ఓటింగ్ ద్వారా లోక్‌సభలో ఆమోదించారు. ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసానింధానం చేయడం వల్ల కొన్ని అక్రమాలని అరికట్టవచ్చని ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

1. ఆధార్, ఓటరు ఐడీ కార్డ్‌ని లింక్ చేయడానికి ముందుగా NVSP పోర్టల్ (నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్) – www.nvsp.inలో నమోదు చేసుకోవాలి.

2. వెబ్‌సైట్‌కి వెళ్లి కొత్త వినియోగదారు ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.

3. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీనిని ఎంటర్‌ చేయండి.

4. తర్వాత మీ ముందు ఒక పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో మొత్తం సమాచారాన్ని నమోదు చేయాలి. ఇప్పుడు సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ మొత్తం సమాచారం నమోదు అవుతుంది.

Tags:    

Similar News