Virat Kohli: జెర్సీ నంబర్ 18తో IPL 18 సీజన్ ఫైనల్‌కి సిద్ధం..ఈసారి ట్రోఫీ కోహ్లీదేనా?
విరాట్ కోహ్లీ IPL 18వ సీజన్‌లో జెర్సీ నంబర్ 18తో ఫైనల్‌కు సిద్ధం. RCB ట్రోఫీ గెలుస్తుందా? ఈసారి కోహ్లీకి టైటిల్ దక్కుతుందా? ఫైనల్ మ్యాచ్ విశేషాలు తెలుసుకోండి.
Virat Kohli: జెర్సీ నంబర్ 18తో IPL 18 సీజన్ ఫైనల్‌కి సిద్ధం… ఈసారి ట్రోఫీ కోహ్లీదేనా?
Virat Kohli: "విరాట్ కోహ్లీ" పేరు వింటేనే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా ఉండదు. IPLలో 17 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తన విశిష్టమైన సేవలందించిన కోహ్లీ, ఈసారి మాత్రం ట్రోఫీ గెలిపించాలన్న ఉద్దేశంతో మరింత ఫోకస్‌తో బరిలోకి దిగాడు. జెర్సీ నంబర్ 18, IPL 18వ సీజన్, 2025 ఫైనల్‌లో RCB vs పంజాబ్ కింగ్స్ మధ్య పోరు... ఫ్యాన్స్ అయితే ఇదే కోహ్లీ గెలిచే సీజన్ అని నమ్ముతున్నారు.
కోహ్లీకి ‘ట్రోఫీ’ మాత్రమే మిగిలింది
కోహ్లీ తన కెరీర్‌లో వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇటీవలే T20 వరల్డ్‌కప్ లాంటి ICC టైటిల్స్ గెలిచాడు. కానీ IPL ట్రోఫీ మాత్రం ఇప్పటివరకు అందని కలగా మిగిలిపోయింది. 8,500+ రన్స్, ఐదు సీజన్లలో 600కు పైగా రన్స్ చేసిన ఘనత, కానీ కప్పు మాత్రం కోల్పోయాడు. 2016 సీజన్‌లో 973 రన్స్ చేసినా ఫైనల్‌లో ఓటమి వల్ల ట్రోఫీ మాత్రం అతడి చేతికి రాలేదు.
RCB – ‘అన్‌లక్కీ’ ట్యాగ్ చెరిపేసే టైమ్
RCB ఇప్పటికే మూడుసార్లు ఫైనల్‌కి చేరింది, కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ప్రతీసారి ఏదో ఒక దశలో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ ఈ సీజన్ మాత్రం చాలా డిఫరెంట్. తొమ్మిదేళ్ల తర్వాత RCB టాప్ 2లో ఫినిష్ చేసింది.
టీమ్ ఎఫర్ట్ – కొత్త పవర్
ఈ సీజన్‌లో విజయానికి కారణం కేవలం కోహ్లీ కాదు.
ఫిల్ సాల్ట్ – 175 స్ట్రైక్ రేట్‌తో 387 రన్స్
మిడిల్ ఆర్డర్ – నాలుగు మంది బ్యాటర్లు 200+ రన్స్
బౌలింగ్ యూనిట్ – హేజిల్‌వుడ్, భువనేశ్వర్, యశ్ దయాల్, సుయాష్ శర్మ ఇలా అందరూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.
సుయాష్ శర్మ – క్వాలిఫైయర్ 1లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు.
ఇప్పటి వరకు "కోహ్లీ టీమ్" అనే పేరు విన్నా, ఇప్పుడు "బ్యాలెన్స్‌డ్ RCB" అనే మాట వినిపిస్తోంది.
కోహ్లీకి ఇది లెగసీ మ్యాచ్
ఈ మ్యాచ్ కేవలం ఫైనల్ మాత్రమే కాదు, కోహ్లీ లెగసీకి సంబంధించిన కీలక ఘట్టం. ఇదే అతనికి బెస్ట్ ఛాన్స్ కావచ్చు అని పలువురు మాజీలు భావిస్తున్నారు. కోహ్లీకి ఇంకా IPL కెరీర్ ఉంది కానీ, ఈ టైమ్‌కి RCB ఫామ్, టీమ్ బలాన్సు, కోహ్లీ ఫిట్‌నెస్ – అన్నీ కలిసొచ్చాయి.
AB డివిలియర్స్ అభిప్రాయం ప్రకారం – "అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ విజయం లభించదు. కానీ విజయం ఎవరికైనా రావాలి అంటే అది విరాట్‌కే రావాలి." అని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అభిమానుల కోరిక ఒక్కటే – ఈ రోజు 7:30 గంటలకు జరిగే ఫైనల్‌లో కోహ్లీ ట్రోఫీ లిఫ్ట్ చేయాలని!
ఈసారి కాదు అంటే, ఇంకప్పుడూ కాదనిపిస్తోంది!