Venkaiah Naidu: ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ప్రదానమైనవి

Venkaiah Naidu: గబాన్ అభివృద్ధి పథంలో భారత్ ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది

Update: 2022-06-01 02:37 GMT

Venkaiah Naidu: ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ప్రదానమైనవి

Venkaiah Naidu: ఆఫ్రికాతో సంబంధాలు భారత్ కు ప్రదానమైనవన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మూడు దేశాల పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు గబాన్ రిపబ్లిక్ రాజధాని లిబ్రేవిల్లా చేరుకున్నారు. గబాన్ ప్రధాని రోజ్ క్రిస్టైనా ఒసుకా రాపోండా, ఆ దేశా విదేశాంగ మంత్రి మైకెల్ మౌసా ఆడమో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు అలీ బొంగో ఒండిమాతో వెంకయ్య నాయుడు సమావేశం అయ్యారు. గబాన్ ప్రధానితో అత్యున్నత స్థాయి అధికారిక చర్చల్లోనూ ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. 

గబాన్ అభివృద్ధి పథంలో భారత్ ప్రభుత్వం విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటుందని ఉపరాష్ట్రపతి భరోసా కల్పించారు. ఫార్మాసూటికల్స్, ఎనర్జీ, వ్యవసాయం, వరి, రక్షణ, భద్రత, ఆయిల్ అండ్ గ్యాస్, సౌరశక్తి తదితర అంశాల్లో వాణిజ్యం మరంతగా పెరిగేందుకు అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

Tags:    

Similar News