ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని వెంకయ్యనాయుడు కార్యాలయం..

Update: 2020-09-30 03:04 GMT

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని వెంకయ్యనాయుడు కార్యాలయం మంగళవారం సాయంత్రం ట్వీట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. లక్షణాలు లేకుండా ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారని కార్యాలయం ట్వీట్‌లో పేర్కొంది. అందులో ఇలా ఉంది.. 'మంగళవారం ఉదయం రొటీన్ COVID-19 పరీక్ష చేయించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పాజిటివ్ గా వచ్చింది. అయినప్పటికీ, ఆయన లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు.

ఆయన సతీమణి శ్రీమతి ఉషా నాయుడుకు మాత్రం నెగటివ్ అని తేలింది' అని వెంకయ్య కార్యాలయం నుండి వచ్చిన ట్వీట్ లో ఉంది. కాగా రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడు ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు, సభకు హాజరైన వారిలో 25 మందికి పైగా సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. పార్లమెంటు ఉభయ సభలు అక్టోబర్ 1 న నిర్ణయించిన తేదీ వరకు కొనసాగకుండా సెప్టెంబర్ 23 న నిరవధికంగా వాయిదా పడ్డాయి.

Tags:    

Similar News