Rahul Gandhi: నేడు రాహుల్‌గాంధీ పిటిషన్‌పై తీర్పు..

Rahul Gandhi: పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష విధించడంపై..సూరత్ సెషన్స్‌ కోర్టులో సవాల్ చేసిన రాహుల్

Update: 2023-04-20 03:01 GMT

Rahul Gandhi: నేడు రాహుల్‌గాంధీ పిటిషన్‌పై తీర్పు..

Rahul Gandhi: పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వేసిన పిటిషన్‌ మీద ఇవాళ తీర్పు వెలువడనుంది. మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను మార్చి 23న సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సూరత్‌ సెషన్స్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 13న వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు.

రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడింది. అయితే కుట్రపూరితంగా తన హోదాను దెబ్బతీసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని రాహుల్ ఆరోపిస్తున్నారు. అటు రాహుల్ తరపు న్యాయవాది కూడా ఇదే వాదన వినిపించారు. కింది కోర్టు ట్రయల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్‌పై నమోదైన పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన అవసరం లేదని.. వెంటనే తీర్పుపై స్టే విధించాలని కోరారు.

ఇవాళ కోర్టు తీర్పు రాహుల్‌కు అనుకూలంగా వస్తే.. ఎంపీగా ఆయన మళ్లీ అర్హత సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే కింది కోర్టు ఇచ్చిన డెడ్‌లైన్‌ మేరకు స్టే తెచ్చుకునేందుకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆలోపు తీర్పును నిలుపుదల చేయకుంటే రాహుల్‌ గాంధీ పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది. 

Tags:    

Similar News