వామ్మో! సెంచరీ కొట్టిన టమాటా.. షాక్ లో సామాన్యుడు..

Vegetable Price: పెరిగిన ఆయిల్ ధరలతో ప్రజలు సతమతం అవుతుంటే మరోవైపు కూరగాయల ధరలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Update: 2022-05-17 16:00 GMT

వామ్మో! సెంచరీ కొట్టిన టమాటా.. షాక్ లో సామాన్యుడు..

Vegetable Price: పెరిగిన ఆయిల్ ధరలతో ప్రజలు సతమతం అవుతుంటే మరోవైపు కూరగాయల ధరలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక్కసారిగా ధరలు పెరిగి ఊహకందని రేట్లతో పేద, మధ్య తరగతుల వారికి కూరగాయలు కొనలేని పరిస్థితులు ఉంటున్నాయి. గతంలో 100కి నాలుగైదు రకాల కూరగాయలు వస్తే ఇప్పుడు, ఒకటి, రెండు రకాలు కూడా రావడం లేదు. టమాటా ధర అందనంత స్థాయికి ఎగబాకుతుంటే మిగిలిన కూరగాయాల పరిస్థితి కూడా అలాగే ఉంది. మార్కేటో కూరగాయల ధరలపై స్పెషల్ స్టోరి.

కూరగాయలు ముట్టుకుంటే మంట పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్ కు వెళ్లి సంచి నిండా సరిపడా కూరగాయలు తెచ్చిన డబ్బుతో ఇప్పుడు, ఒక్క పూటకు సరిపోవడం లేదు. ఊహలకు అందనంత స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. మార్చ్ లో టమాట కిలో 10 రూపాయలు ఉండగా ఇప్పుడు కిలో 80 రూపాయలు ఉన్నాయి. మరీ సూపర్ మార్కెట్ లో అయితే 100 రూపాయలు ఉన్నాయి. మిగితా కూరగాయలన్ని కిలో 70 రూపాయల పైగా ఉండటంతో సామన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.

కూరగాయల మార్కెట్ లో ఏది కొనాలన్నా కిలో 70 రూపాయల పైమాటే ఉందని పేద, మధ్య తరగతి వారు కొనాలంటే చాలా కష్టంగా ఉందని కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దగ్గర సూపర్ మార్కెట్ లో ఎక్కువ ధరలు ఉన్నాయని, తక్కువ ధరలకు వస్తాయని రైతు బజార్ కి వస్తున్నమని మిగతా ఏ కూరగాయలు కొనాలన్నా కొనాల్సిన వాటికంటే తక్కువగా కొంటున్నమని అంటున్నారు.

ఎండకి పంటలు సరిగ్గా రావడం లేదని దిగుబడి తక్కువగా ఉందని అంటున్నారు వ్యాపారస్తులు. రవాణా ఛార్జీలు పెరిగియన్నారు. రానున్న రెండు నెలల్లో మరింత టమాటా ధర ఉంటుందని, ఏది కొనాలన్న ప్రజలు ఆలోచిస్తున్నారని వ్యాపారులు తెలిపారు.

ఒకప్పుడు మార్కెట్ కి వచ్చి సంచి నిండా కూరగాయలు కొనే కొనుగోలు దారులు ఇప్పుడు కొనాల్సిన దానికన్నా తక్కువ కొంటున్నామ్ అంటున్నారు. వ్యాపారులు మాత్రం రానున్న రోజుల్లో మరింత కూరగాయల ధరలు పెరుగుతాయని అంటున్నారు.

Tags:    

Similar News