Lalit Modi: లలిత్ మోదీకి షాక్.. వనాటు పౌరసత్వం రద్దు
Lalit Modi: లలిత్ మోదీకి వనాట్ పౌరసత్వం రద్దు చేయాలని ఆ దేశ ప్రధానమంత్రి జోథం నపాట్ అధికారులను ఆదేశించారు.
Lalit Modi: లలిత్ మోదీకి షాక్.. వనాటు పౌరసత్వం రద్దు
Lalit Modi: లలిత్ మోదీకి వనాట్ పౌరసత్వం రద్దు చేయాలని ఆ దేశ ప్రధానమంత్రి జోథం నపాట్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ వ్యవస్థాపకులు లలిత్ మోదీ తనభారత పాస్ పోర్టును లండన్ లో భారత అధికారులకు అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నారు.అదే సమయంలో వనాట్ పౌరసత్వాన్ని కూడా ఆయన పొందారు.
లలిత్ మోదీ వనాటు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఇంటర్ పోల్ స్క్రీనింగ్ సహా ఇతర అంశాలకు సంబంధించి ఎలాంటి నేరాలకు సంబంధించిన సమాచారం లేవని వనాటు అధికారులు గుర్తించారు. కానీ, లలిత్ మోదీకి వనాటు పౌరసత్వం తీసుకున్నట్టు మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో భారత్ ఇంటర్ పోల్ ను లలిత్ మోదీ కోసం అభ్యర్ధించిన విషయాన్ని వనాటు అధికారులు గుర్తించారు.
భారత్ లో దర్యాప్తును తప్పించుకునేందుకు పౌరసత్వం తీసుకోవాలని ఆయన ప్రయత్నించినట్టుగా వనాటు అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని అధికారులను ఆదేశించారు.