Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ ప్రమాదం.. ఆవును ఢీకొట్టిన రైలు..

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.

Update: 2022-10-29 10:03 GMT

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ ప్రమాదం.. ఆవును ఢీకొట్టిన రైలు..

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. శనివారం గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ పరిధిలో సెమీ హై స్పీడ్‌ రైలును ఆవు ఢీకొనడంతో కొద్దిసేపు ఆగిపోయింది. దీంతో రైలు కొంతసేపు ఆగిపోయింది. సిబ్బంది యుద్దప్రాతిపదికన రైలు ముందుభాగానికి మరమ్మతులు నిర్వహించారు. దీని తరువాత రైలు తిరిగి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. నెలరోజుల వ్యవధిలో ఈ తరహాలో జరిగిన మూడో ఘటన ఇది.

Tags:    

Similar News