భయం గుప్పిట్లో ఉత్తరాఖండ్‌ ప్రజలు.. మరింత తీవ్రమైన ఇళ్లు, రోడ్ల పగుళ్లు..

భయం గుప్పిట్లో ఉత్తరాఖండ్‌ ప్రజలు.. మరింత తీవ్రమైన ఇళ్లు, రోడ్ల పగుళ్లు..

Update: 2023-01-07 12:17 GMT

భయం గుప్పిట్లో ఉత్తరాఖండ్‌ ప్రజలు.. మరింత తీవ్రమైన ఇళ్లు, రోడ్ల పగుళ్లు..

Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఇళ్లు, రోడ్లపై పగుళ్లు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. తాజాగా సింగ్‌ధార్‌ వార్డులోని ఓ దేవాలయం కుప్పకూలడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ... అక్కడి మరిన్ని ఇళ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

ఇప్పటికే సీఎం పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్‌లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ప్రజలను తరలించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. అసలు అక్కడ భూమి కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చిన వారికి వేరే చోట ఉండేందుకు అద్దె కోసం 4 వేల రూపాయలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆరు నెలల పాటు ఈ సహాయం అందించనున్నారు. 

Tags:    

Similar News