Uttar Pradesh: యూపీలో త్వరలో 'ఇద్దరు పిల్లల' నిబంధన
Uttar Pradesh: జనాభా నియంత్రణ బిల్లు రూపొందించిన ఉత్తరప్రదేశ్
Representational Image
Uttar Pradesh: జనాభా నియంత్రణకు యూపి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇద్దరు పిల్లల నిబంధనతో కొత్తచట్టం తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతనం ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు ప్రతిపాదించింది. యూపీ జనాభా నియంత్రణ బిల్లు-2021 ముసాయిదాని ఆ రాష్ర్ట లా కమిషన్ తాజాగా విడుదలచేసింది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే యూపీలో ఇద్దరు పిల్లల నిబంధన అమలులోకి రానున్నది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు వీలుండదు.
కుటుంబంలో ఎంత మంది ఉన్నా..రేషన్ కార్డులో నలుగురు వ్యక్తులు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలు కూడా అందవని ప్రకటించారు. మరో వైపు ఇద్దరు పిల్లల నిబంధన పాటించే వారికి ప్రోత్సాహకాలు కూడా అందించనున్నారు.