కొత్త కారు తీసుకున్నారా.. మీ పాత వెహికిల్ నంబర్‌నే పొందే అవకాశం.. ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉందో తెలుసా?

కొత్త కారు తీసుకున్నారా.. మీ పాత వెహికిల్ నంబర్‌నే పొందే అవకాశం.. ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉందో తెలుసా?

Update: 2022-01-13 08:30 GMT

కొత్త కారు తీసుకున్నారా.. మీ పాత వెహికిల్ నంబర్‌నే పొందే అవకాశం.. ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉందో తెలుసా?

మీరు మీ పాత వాహనాన్ని స్క్రాప్ చేసి, దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించాలనుకుంటున్నారా.. ఇలాంటి ఆఫ్షన్‌ ప్రస్తుతం కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే అమల్లో ఉంది. దీనిపై ఇతర రాష్టాలు కూడా ఆసక్తి చూపుతుండడంతో త్వరలోనే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశం తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్ ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త నిబంధనను ప్రకటించింది. దీని ద్వారా వాహన యజమానులు తమ పాత వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొత్త వాహనంలో ఉపయోగించగలరు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పూర్ణేష్ మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత గుజరాత్ కూడా వెహికల్ నంబర్ రిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాలసీ ప్రకారం, ఇప్పుడు వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను రెండుసార్లు ఉంచుకోగలరు. భారీ సంఖ్యలో దరఖాస్తుదారుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ప్రకారం, పాత వాహనాన్ని స్క్రాప్ చేసిన తర్వాత, దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొత్త వాహనంపై ఉపయోగించవచ్చు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి రూల్స్ వచ్చిన తర్వాత, గుజరాత్ ప్రభుత్వం కూడా అలాంటి విధానాన్నే తీసుకొచ్చింది. గుజరాత్‌లోని ఎక్కువ శాతం మంది ప్రజలు డిమాండ్ మేరకు ఇలాంటి విధానానికి రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు.

కొత్త నియమాలు..

పాత లేదా కొత్త వాహనం కొనుగోలు చేసినా, ముందుగా కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ పొందడం తప్పనిసరి.

దీని తర్వాత పాత వాహనం స్క్రాప్ అయినట్లయితే, కొత్త వాహనానికి రిటైన్డ్ నంబర్ అంటే స్క్రాప్ చేసిన వాహనం నంబర్ ఇస్తారు.

రెండు వాహనాలు (పాతవి, కొత్తవి) ఒకే వ్యక్తికి చెందినవి కావడం తప్పనిసరి. పాత వాహనం వేరొకరి పేరు మీద ఉంటే మాత్రం అది కుదరదు. మీరు మీ వాహనాన్ని దాని నంబర్ సహాయంతో నమోదు చేసుకోవాలి.

నంబర్‌ని నిలుపుకోవడానికి వాహన యజమాని కనీసం ఒక సంవత్సరం ఆ వాహనాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది.

కొత్త వాహనానికి రిటైన్డ్ నంబర్‌ను కేటాయించే ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News