Foreign Oxygen: వారం రోజులపాటు 'విదేశీ ఆక్సిజన్లు'

Foreign Oxygen: కరోనా పై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది.

Update: 2021-04-29 02:46 GMT

Foreign Oxygen:(File Image)  

Foreign Oxygen: ఇండియాలో కోరలు చాస్తున్న కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు అగ్ర రాజ్యం అమెరికా ఆపన్న హస్తం అందిస్తోంది. ఆ దేశం నుంచి భారత్ కు 'కోవిద్' సాయం వెల్లువెత్తనుంది. దాదాపు వారం రోజుల పాటు తాము ఇండియాకు సప్లయ్ లు కొనసాగిస్తామని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది.

10 కోట్ల డాలర్ల విలువైన సప్లయ్ లు అందనున్నాయి. వీటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల విలువైన ఎన్ 95 మాస్కులు, 10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ పరికరాలు తదితరాలు ఉంటాయి. గురువారం నుంచే వీటి సరఫరాను ప్రారంభిస్తామని యూఎస్ ప్రకటించింది. ఆస్ట్రాజెనికా కంపెనీ భారత్ కోసం 20 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసి పంపనుంది. అవసరమైతే ఇంకా సహాయం చేస్తామని, గతంలో మేం కరోనా వైరస్ బెడదను ఎదుర్కొన్నప్పుడు మీరు చేసిన సాయం మరువలేదని అమెరికా ఈ ప్రకటనలో పేర్కొంది.

ఇప్పటికే తమ డెల్టా సంస్థ ఈ సాయానికి తమ విమానాలను సిధ్దం చేసిందని, ఏ క్షణంలో నైనా ఇవి ఇండియాకు ప్రయాణిస్తాయని వెల్లడించింది. అలాగే కార్గో విమానాలను కూడా ఈ దేశం రెడీగా ఉంచింది. ఇండియాలో ఖాళీగా ఉన్న తమ కార్యాలయాలను వ్యాక్సిన్ సెంటర్లుగా వినియోగించుకోవడానికి అమెరికాలోని పలు సంస్థలు అనుమతించాయి.



Tags:    

Similar News