సమస్యే లేదు, విచారణకు భారత్‌ వెళ్లాల్సిందే.. 26/11 కేసులో అమెరికా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా అభ్యర్థనను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Update: 2025-03-07 08:47 GMT

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా అభ్యర్థనను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనను భారత్ కు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు. తనను భారత్ కు అప్పగించవద్దని ఆ పిటిషన్ లో కోరారు. అయితే ఈ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.ముంబైలో 26/11 దాడుల కేసులో కీలక సూత్రధారి రాణా.

ఎవరీ తహవూర్ రాణా?

పాకిస్తాన్ మూలాలున్న కెనడా వ్యాపారవేత్త తహవూర్ రాణా. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ జైల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. అతడిని అప్పగించాలని భారత్ పోరాటం చేస్తోంది. ఇందుకు అమెరికా కూడా అంగీకరించింది. 2008లో ముంబై లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 170 మందికి పైగా మరణించారు. ముంబై దాడులకు సంబంధించి మాస్టర్ మైండ్ గా ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించారు. అతడికి రాణా సహకరించారని ఆరోపణలున్నాయి. 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో హెడ్లీతో అతనికి పరిచయం ఏర్పడింది. ముంబైలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది.

ముంబై దాడుల కేసులకు సంబంధించి ఎఫ్ బీ ఐ ఆయనను 2009లో చికాగోలో అరెస్ట్ చేసింది. ముంబై దాడులకు సంబంధించి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఎల్‌ఈటీకి మద్దతిచ్చారని ఆయనపై ఎఫ్‌బీఐ ఆరోపణలు మోపింది.ఉగ్రవాద సంస్థకు దోషిగా నిర్ధారణ అయింది. కానీ, ముంబై దాడులతో నేరుగా సంబంధం ఉన్న ఆరోపణల నుంచి ఆయన నిర్ధోషిగా విడుదలయ్యారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో రాణా అప్పగింత అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ పోరాటం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాణా న్యాయస్థానాలను ఆశ్రయించారు. 224 నవంబర్ 13న సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం రాణా అభ్యర్థనను తిరస్కరించింది.

Tags:    

Similar News