ట్రంప్‌కు కరోనా పరీక్షలు.. రిపోర్ట్‌లో తేలిందిదే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనావైరస్ పరీక్షలు చేసినట్లు అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు తెలిపారు.

Update: 2020-03-15 03:59 GMT
Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనావైరస్ ప్రతికూలంగా  వచ్చినట్లు అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో, కమ్యూనికేషన్‌ చీఫ్‌ ఫాబియోతో ఇటీవల సంప్రదింపులు జరిపారు. అయితే వారిలో ఫాబియోకు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది.  దాంతో అనుమానం వచ్చి డొనాల్డ్ ట్రంప్ కు కూడా కొరోనావైరస్ పరీక్షలు చేశారు. పరీక్షల కోసం ట్రంప్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.. గంటల వ్యవధిలోనే వైట్ హౌస్ ట్రంప్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అందులో కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిందని.. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

వాస్తవానికి వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన వ్యక్తులతో ట్రంప్ పలు ప్రత్యక్ష మరియు పరోక్ష పరిచయాలను కలిగి ఉన్నారు. కాగా గత శనివారం ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్‌లో జరిగిన సమావేశానికి హాజరైన బ్రెజిల్ ప్రభుత్వ అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు బ్రెజిల్ ప్రభుత్వం గురువారం తెలిపింది. బ్రెజిల్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ ఫాబియో వాజ్గార్టెన్ ఈ వైరస్ భారిన పడ్డారని.. అమెరికా అధ్యక్షుడి పక్కన నిలబడి ఉన్న వాజ్గార్టెన్ ఫోటోను పోస్ట్ చేసి ఆయనను కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసినట్టు వెల్లడించింది.

ఇదిలావుంటే కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు అమెరికాలో 2,200 మందికి పైగా సోకింది.. అక్కడ ఇప్పటివరకూ 50 మంది మరణించారు. ఈ క్రమంలో కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచం దేశాలు సమాయత్తమైన తరుణంలో అమెరికా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్‌ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేశారు. అదే విధంగా కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్‌ ప్రకటన చేశారు. అలాగే ఆరు రాష్ట్రాల గవర్నర్లు ఫ్లోరిడా, అయోవా, లూసియానా, న్యూయార్క్, రోడ్ ఐలాండ్ మరియు వాషింగ్టన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని జాతీయ భద్రతా దళాలను ఆదేశించారు.



Tags:    

Similar News