UPSC Prelims 2021: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలపై యూపీఎస్సీ కీలక ప్రకటన

UPSC Prelims 2021: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-05-13 11:11 GMT

UPSC Prelims 2021: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలపై యూపీఎస్సీ కీలక ప్రకటన


UPSC Prelims 2021: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 27 ప్ర్రిలిమినరీ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. దేశంలో కోవిడ్ సెకెండ్ వేవ్ నడుస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు యూపీఎస్‌సీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్‌ 10న నిర్వహించాలని నిర్ణయించినట్టు కమిషన్‌ వెల్లడించింది. కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ కు అవకాశం కల్పిస్తారు. మెయిన్స్ లో ర్యాంకు సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి సివిల్ సర్వీసెస్ కు యూపీఎస్సీ ఎంపిక చేస్తోందన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News