UPSC Civil Services Examination 2019 result Announced: 2019 సివిల్‌ సర్వీసెస్‌‌ ఫలి‌తాల విడుదల

Update: 2020-08-04 08:22 GMT

UPSC Civil Services Examination 2019 result Announced: ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2019కి సంబంధించిన తుది‌ ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. 2019 సెప్టెంబ‌ర్‌లో మెయిన్స్ ప‌రీక్షలు జ‌రుగ‌గా 2020 ఫిబ్ర‌వ‌రి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు. ఇంట‌ర్వ్యూలో నెగ్గి మొత్తం 829 మంది అభ్యర్థులు సివిల్‌ స‌ర్వీసుల‌కు ఎంపికైన‌ట్లు యూపీఎస్సీ తెలిపింది.

ఇందులో 304 మంది జనరల్‌, 78 మంది ఈబీసీ, 254 మంది ఓబీసీ, 129 ఎస్సీ, 67 మండి ఎస్టీ అభ్యర్ధులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంక్‌, జతిన్‌ కిషోర్‌ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్‌ సాధించారు. అభ్య‌ర్థులు త‌మ వెబ్‌సైట్లో ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చ‌ని యూపీఎస్సీ స్ప‌ష్టం చేసింది.



Tags:    

Similar News