Uttar Pradesh 492 MLA Candidates With Criminal Cases: అక్కడ 492 మంది ఎమ్మెల్యే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

Uttar Pradesh 492 MLA Candidates With Criminal Cases: 22 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. అంత జనాభా పాకిస్తాన్‌కు సమానం.

Update: 2020-07-09 07:48 GMT
Uttar Pradesh 492 MLA candidates With Criminal Cases

Uttar Pradesh 492 MLA Candidates With Criminal Cases: 22 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. అంత జనాభా పాకిస్తాన్‌కు సమానం. ఇక్కడ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు అత్యధికంగా ఉన్నాయి. 80 లోక్‌సభ ఎంపీలు, 403 మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయి.

అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఎడిఆర్ నివేదిక ప్రకారం, 2019 లో ఇక్కడ ఎన్నికైన 80 లోక్‌సభ ఎంపీలలో 44 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన 403 మంది ఎమ్మెల్యేలలో 147 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ఉత్తర ప్రదేశ్‌లో 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 859 పై క్రిమినల్ కేసులు ఉన్నాయి . ఈ ఎన్నికల్లో 403 స్థానాలకు 4 వేల 823 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అందులో 17% అంటే 859 మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. ఈ 859 మందిలో 704 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. తీవ్రమైన నేరాలు అంటే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే లేదా బెయిల్ లేని నేరాలుగా పరిగణించాలి.

కాగా ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, ఎస్పీ, బిఎస్పి, ఆర్‌ఎల్‌డి పార్టీలు మొత్తం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 1, 480 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. అందులో 492 మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. దీని ప్రకారం, ఈ ఐదు పార్టీలు అసెంబ్లీ ఎన్నికలలో నిలబడిన మొత్తం అభ్యర్థులలో, 33% కంటే ఎక్కువ మంది క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు.


Tags:    

Similar News