Nirav Modi Assets Seized: రూ. 300 కోట్ల నీరవ్ మోదీ ఆస్తుల జప్తు

Nirav Modi Assets Seized:  రూ. 300 కోట్ల నీరవ్ మోదీ ఆస్తుల జప్తు
x
Highlights

Nirav Modi Assets Seized: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణంలో నిందితుడైన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద చర్యలు తీసుకుంది.

Nirav Modi Assets Seized: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణంలో నిందితుడైన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద చర్యలు తీసుకుంది. ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరాల చట్టం ప్రకారం 300 కోట్లకు పైగా విలువైన నీరవ్ మోడీ ఆస్తిని జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.

329.66 కోట్ల విలువైన నీరవ్ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ ఎఎన్‌ఐ తెలిపింది. ఇందులో సముద్రీ మహల్ లో నాలుగు ఫ్లాట్లు, ముంబైలో ఐకానిక్ భవనం, సి-సైడ్ ఫామ్‌హౌస్, అలీబాగ్‌లోని భూమి, జైసల్మేర్‌లోని విండ్‌మిల్లులు, లండన్‌లోని ఫ్లాట్లు మరియు యుఎఇలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లు, షేర్లు మరియు బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి.

అంతకుముందు 2020 మార్చిలో నిర్వహించిన వేలంలో నీరవ్ మోడీకి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో కూడా ఖరీదైన పెయింటింగ్‌లు, గడియారాలు, పర్సులు, ఖరీదైన కార్లు, హ్యాండ్‌బ్యాగులు వంటివి ఉన్నాయి. ఈ వేలంలో సుమారు 51 కోట్ల మిల్లులు కూడా ఉన్నాయని ఈడీ తెలిపింది.

13,700 కోట్ల రూపాయల పిఎన్‌బి కుంభకోణంలో నిందితుడైన నీరవ్ లండన్ వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. లండన్ పోలీసులు గత మార్చి 19 న అతన్ని అరెస్ట్ చేశారు. అతని బెయిల్ దరఖాస్తు ఇప్పటికే 5 సార్లు తిరస్కరించబడింది. అతన్ని భారత్ కు తిరిగి తీసుకురావడానికి భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కేసును లండన్ కోర్టులో విచారిస్తున్నారు. గత నెల, లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు నీరవ్ మోడిని జూలై 9 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories