అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీకారం

Ayodhya: శ్రీరామ మందిర నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైన అయోధ్యలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్.

Update: 2022-04-07 16:00 GMT

అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీకారం

Ayodhya: శ్రీరామ మందిర నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైన అయోధ్యలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్. అయోధ్య అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఒప్పందం కుదరింది. మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి యోగి సమక్షంలో మరో 317 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లీజుకు ఇచ్చారు.

రాష్ట్ర పౌర విమానయాన శాఖ మరియు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య లీజు ఒప్పందం ఉంది. విమానాశ్రయ ప్రాజెక్టు కోసం 317 ఎకరాల భూమిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సేకరించింది. ఈ విమానాశ్రయంతో కలిపి యూపీలో మొత్తం 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 5 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ తో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో యూపీ నిలిచింది.

Tags:    

Similar News