మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Elections: యూపీ, గోవా, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.

Update: 2022-02-14 05:46 GMT

మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Elections: మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. యూపీలో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పటిష్ట భద్రత మధ్య ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు యూపీలో 9.45 శాతం, ఉత్తరాఖండ్‌లో 5.15 శాతం, గోవాలో 11.04 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాద షాజహాన్‌పుర్‌లో ఓటేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ దామి ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావత్.. కోఠంబి నియోజకవర్గంలో ఓటేశారు. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె.. మేయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక గోవా, ఉత్తరాఖండ్‌లో నేడు ఒకే విడతలో పోలింగ్ పూర్తికానుంది. గోవాలో 40 సీట్లు, ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఇక యూపీలో 55 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరుగుతోంది. అన్ని దశలకూ కలిపి మార్చి 10న ఫలితాలను వెల్లడించనున్నారు.  

Tags:    

Similar News