యూపీ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురు దెబ్బ.. మంత్రి పదవికి, పార్టీకి గుడ్ బై కొట్టేసిన...
Swami Prasad Maurya: యూపీ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
యూపీ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురు దెబ్బ.. మంత్రి పదవికి, పార్టీకి గుడ్ బై కొట్టేసిన...
Swami Prasad Maurya: యూపీ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యోగీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య కొద్ది సేపటి క్రితం బీజేపీకి గుడ్ బై కొట్టేశారు. దళితులు, వెనుకబడినవర్గాలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న, మధ్యతరహా వ్యాపార వేత్తలను యోగీ ప్రభుత్వం విస్మరించిందని అందుకే మంత్రివర్గంలో కొనసాగాదలచుకోలేదని స్వామిప్రసాద్ తనరాజీనామాలో తెలిపారు.
ఒకవైపు బీజేపీ ఇంటింటికీ ప్రచారం ముమ్మరం చేసి, యోగీ చేపడుతున్న అభివృద్ధి పనులను వివరిస్తున్న తరుణంలో సొంత పార్టీనుంచే నేతల నిష్క్రమణ యోగీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు స్వామి ప్రసాద్. మరో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో పయనించనున్నట్లు సమాచారం.