Ashwini Vaishnaw: దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్
Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను, నాలుగు ప్యాసింజర్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను, నాలుగు ప్యాసింజర్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణతో కలుపుతాయి. ఈ సందర్భంగా, అశ్విని వైష్ణవ్ ఛత్, దీపావళికి 12వేల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు.
అజ్మీర్-దర్భంగా, ఢిల్లీ-ఛప్రా, ముజఫర్‌పూర్-హైదరాబాద్ మధ్య మూడు అమృత్ భారత్ రైళ్ల సర్వీసులు ప్రారంభమయ్యాయి. దసరా సందర్భంగా ప్రధాని మోడీ జీఎస్టీ పొదుపు పండుగను ప్రజలకు బహుమతిగా ఇచ్చారని...ప్రధాని నాయకత్వంలో రైల్వేలో పనులు వేగంగా జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.