Union Minister Krishan Pal Gurjar : మరో కేంద్రమంత్రికి కరోనా!
Union Minister Krishan Pal Gurjar : సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి కరోనా సోకుతూ ప్రజలను మరింత భయబ్రాంతులకి గురి చేస్తోంది
representative image
Union Minister Krishan Pal Gurjar : సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి కరోనా సోకుతూ ప్రజలను మరింత భయబ్రాంతులకి గురి చేస్తోంది. ఇప్పటికే అయిదుగురు కేంద్రమంత్రులకి కూడా కరోనా సోకగా తాజాగా కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ కరోనా బారిన పడ్డారు.. ఈ విషయాన్ని అయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గత కొన్ని రోజులు అయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించుకున్నారు.. అయితే అందులో కరోనా పాజిటివ్ అని తేలింది.. దీనితో ప్రస్తుతం అయన ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇక తనను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 63 ఏళ్ల కష్ణపాల్ ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాష్ చౌధురి, శ్రీపాద యశోనాయక్ కొవిడ్ బారినపడ్డారు.
అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75,760 కేసులు నమోదు కాగా, 1023 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 56,013 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో కలిపి మొత్తం 33,10,234 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,25,991 ఉండగా, 25,23,771 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 60,472 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.24 శాతంగా ఉంది. దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.