వాళ్లంద‌రికీ 4 ల‌క్ష‌లు ఇవ్వ‌డం కుద‌ర‌దు.. సుప్రీంకు స్ప‌ష్టం చేసిన కేంద్రం

Supreme Court: కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Update: 2021-06-20 11:17 GMT

వాళ్లంద‌రికీ 4 ల‌క్ష‌లు ఇవ్వ‌డం కుద‌ర‌దు.. సుప్రీంకు స్ప‌ష్టం చేసిన కేంద్రం

Supreme Court: కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కటుంబానికి నాలుగు లక్షలు ఇవ్వడం సాధ్యం కాదని కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. అలా ఇవ్వాల్సివస్తే విపత్తు సహాయం నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే.. ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు మొత్తం వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదే జరిగితే కరోనా, తుఫాన్, వరదలు లాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల దగ్గర సరిపడా నిధులు ఉండవని కేంద్రం సుప్రీంకు తెలిపింది. మరోవైపు కరోనాకు పరిహారం చెల్లించి ఇతర వ్యాధులకు నిరాకరించడం కూడా అన్యాయం అవుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. కేవలం వరదలు, భూకంపాల వంటి ప్రకతి వైపరీత్యాలకు మాత్రమే విపత్తు సహాయం వర్తింస్తుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News